Site icon NTV Telugu

Sudheer Reddy : కేసీఆర్‌ కుటుంబానికి బాల్క సుమన్ బానిస

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ టీపీసీసీ ప్రెసిడెండ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో బాల్క సుమన్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. బాల్క సుమన్ బెదిరిస్తే మేము బెదిరేవాళ్ళం కాదని ఆయన స్పష్టం చేశారు. మేము డ్రగ్స్, కరెంట్, సంక్షేమ పథకాల మీద సవాల్ విసిరాం సమాధానం లేదని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్‌ కుటుంబానికి బాల్క సుమన్ బానిస అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బాల్క సుమన్‌ నీ నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడదామా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. రంజిత్ రెడ్డి అవగాహనా తెచ్చుకొని మాట్లాడాలని, రేవంత్‌రెడ్డిని విమర్శించే సత్తా.. స్థాయి మీకు లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version