Site icon NTV Telugu

Fire in the car: కారులో మంటలు.. డ్రైవర్ ఏంచేశాడంటే..

Sudden Fire In A Car

Sudden Fire In A Car

Fire in the car: నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద (TS07GX5897) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్‌ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్‌ బాల్స్‌ వేసి మంటలను అదుపులోకి తెచ్చారు.

Read also: Astrology: అక్టోబర్ 10, సోమవారం దినఫలాలు

దసరా సెలవు ముగించుకుని అందరూ నగరబాట పట్టారు. దీంతో రహదారలు, టోల్‌ గేట్‌ ల వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. కొందరు బస్సల్లో మరికొందరు బైక్స్‌, ఇంకొదరు కార్లలో నగరానికి చేరుకుంటున్నారు. అయితే ఈనేపథ్యంలో.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ కు కొందరు కారులో వస్తున్న క్రమంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులో ప్రయాణించేవారు బయటకు పరుగులు తీశారు. దీంతో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. స్థానిక సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఫైర్‌ బాల్స్‌ వేసి మంటలను అదుపుచేశారు. తృటిలో ప్రాణాలు దక్కడంతో కారులో వున్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
LandSlides: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి.. మరో 52 మంది..

Exit mobile version