Provide bus facility to our village: బస్సుకోసం విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సు మా ఊరికి రావాలంటూ ఆందోళనకు దిగారు. సరైన సమయానికి బస్సులు లేక కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బస్సు వచ్చిన అప్పటికే నిండుగా వుండటంతో.. విద్యార్థులకు ఎక్కడానికి అసలు ఇబ్బందిగా మారింది. అసలు నిలబడటానికి కూడా బస్సులో చోటు లేకుండా పోవడంతో.. విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. పోనీ ఆటోలో వెళదామంటే అదే పరిస్థతి నెలకొంది. అయినా వెళుతున్నామని, చిన్న చిన్న గాయాలు అవుతున్నాయని ఆవేదన వెలబుచ్చుకున్నారు. బస్సు పాసులు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఊరికి బస్సులు వేయించాలని కోరుతున్నారు. చదువుకోవాలంటే బస్సులు లేక క్లాసులకు దూరం అవ్వాల్సి వస్తుందని బస్సులు వేయించాలని కోరుకుంటున్నారు.
RTC బస్సు మా ఊరికి రావాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ రాయపోల్ గ్రామంలో చోటుచేసుకుంది. దండు మైలారం మొక్కునూరు, మీదుగా వచ్చే ఎల్లప్పుడు బస్సుల రాకపోకలు జరుగుతూంటాయి. కానీ బయలుదేరే సమయంలోనే పూర్తిగా నిండి వస్తుండటంతో.. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్నాయి. దానికి గల కారణం బస్సులు రెండు మూడో వుండటం. మూడు గ్రామాలకు కూడా ఒకటి రెండు బస్సు ఉండడం ద్వారా బస్సులో విద్యార్థులు కిక్కిరిసిపోతున్నారు. పోనీ.. ఆటోలో వెళదామంటే.. సరైన సమయానికి ఆటో లేకపోవడం ద్వారా విద్యార్థులు కాలేజీకి, స్కూల్ కి సరైన సమయానికి వెళ్ళలేకపోతున్నామని, మేమందరం బస్సు పాసులు తీసుకున్నాం అయినప్పటికీ గత నెల రోజులుగా ఆటోలో ఎక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆటో కిందపడినప్పుడు చిన్న చిన్న గాయాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి బస్సు కావాలంటూ గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాచారం మండలం లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వారికి బస్సులు లేక నానా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు స్పందిస్తారా? లేదో వేచిచూడాలి.
Amit Shah Meets Jr NTR : నిన్నటి వరకు పవన్ పేరు..ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పేరు..కారణమేంటి.?