Guru Nanak College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో కోర్సులకు యూనివర్షటీ రూ.లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన దిగారు. దీంతో గురునానక్ కాలేజీ ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే.. తమకు న్యాయం చేయాలని, తమడబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాధితులు నిరసన చేపట్టారు. అయితే తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసముందు బైఠాయించారు. స్పందిచిన సబితా ఇంద్రారెడ్డి గురునానక్ కాలేజీ విద్యార్థుల బాధితులతో మాట్లాడుతున్నారు. అయితే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడా మంత్రి మాట్లాడునున్నట్లు సమాచారం. కాగా.. ఇటు విద్యార్థులు, అటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడంలో భారీగా పోలీసులు మోహరించారు.
Read also: KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటి?
నిన్న వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదన్నారు. యూనివర్సిటీ పేరుతో గురునానక్ కాలేజీ మోసం చేసిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపై లాఠీచార్జి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో చెల్లించామని… ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం కోర్సులకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
Encounter: కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం..