Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిజాం కాలేజీ విద్యార్థులు మరోసారి కలిసారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించామని, నేటికీ యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఎందుకు ఇవ్వడంపై లేదంటూ ఆందోళన నేపథ్యంలో.. ఈవిషయమై మంత్రిని కలిసారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి సబితా 50-50 శాతం డిగ్రీ పీజీ విద్యార్థులకు కేటాయిస్తామని, ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పిన మంత్రి సబితా హామీ ఇచ్చారు. అయితే.. లిఖితపూర్వంగా హామీ ఇచ్చి, కట్టించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ హామీకి మేము ఒప్పుకోమని, విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు.
నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని నవంబర్ 8న మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి ఇచ్చినా ఈ వివాదం అనవసరమన్నారు కేటీఆర్. వెంటనే సమస్యకు ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న మహిళా హాస్టల్‌లో విద్యార్థినులకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించామని, నేటికీ యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఇంటర్ బోర్డు సమావేశం
ఇక మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఇంటర్ బోర్డు సమావేశమైంది. పలు అంశాల పై చర్చిస్తున్నారు. మిక్స్ డ్ అక్యుపెన్సీ బిల్డింగ్ లో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల అనుబంధ గుర్తింపు, ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేట్ గా పరీక్షలకు రాయించే అంశంపై చర్చిస్తున్నారు.
ఎజెండాలో 111 అంశాలు పేర్కొన్నారు కొన్ని అంశాలు
1. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు ఫీజుల పెంపు
2. ఇంటర్ పరీక్ష ఫీజు పెంపు
3. ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో బయో మెట్రిక్ హాజరు
4. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్
5. Tspsc ద్వారా ఇంటర్ బోర్డ్ లో 52 ఉద్యోగాల భర్తీ
6. గ్లోబరీనా టెండర్ ప్రకారం ఆ సంస్థకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చే అంశం…
7. ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో ప్రాక్టికల్స్ మొదలగు వాటిపై చర్చజరుగుతుంది.
Twitter Paid Verification Service: ట్విట్టర్ బ్లూటిక్.. భారతీయులు ఎంత చెల్లించాలో తెలుసా..?