Twitter Paid Verification Service: ట్విట్టర్ బ్లూటిక్.. భారతీయులు ఎంత చెల్లించాలో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుభేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. ఆ తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ట్విట్టర్ వెరిపెయిడ్ ఎకౌంట్.. ‘బ్లూటిక్ మార్క్’కు డబ్బులు వసూలు చేయనున్నట్టు ప్రకటించారు.. ఎలాన్ మస్క్ గత రాత్రి ట్వీట్ చేసారు, కంపెనీ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవ అందుబాటులోకి వచ్చేసిందని.. అయితే, కంపెనీ యొక్క కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్లాట్‌ఫారమ్‌లో ఎంత అస్తవ్యస్తంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.. ఇక, బ్లూటిక్ మార్క్ కోసం యూఎస్‌లో 8 డాలర్లుగా నిర్ణయించారు.. 8 డాలర్లు చెల్లించినవారికి బ్లూటిక్ మార్క్ ను ఇస్తుంది ట్విట్టర్.. భారత్‌లోనూ ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ వెర్షన్ అమల్లోకి వచ్చింది.. దీనిపై కొందరు యూజర్లకు మెసేజ్‌లు వస్తున్నాయట.. ఇంతకీ ట్విట్టర్ బ్లూటిక్‌కోసం భారతీయులు ఎంత చెల్లించాలంటే.. ఇదిగో రూ.719 అంటూ.. కొందరు నెటిజన్లు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు.
Read Also: Holiday Cancelled: విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ప్రస్తుతానికి ఐవోఎస్ అంటే ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరికొన్ని రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను వర్తింపజేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. ఇక, బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా ఉంది.. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే సదరు ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.. మరోవైపు.. “రాబోయే నెలల్లో ట్విట్టర్ చాలా మూర్ఖపు పనులను చేస్తుందని దయచేసి గమనించండి.. మేం పని చేసే వాటిని ఉంచుతాం మరియు చేయని వాటిని మారుస్తాం.. అంటూ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్..
ఇక, వివిధ నివేదికల ప్రకారం.. ఈ చెల్లింపు-టు-వెరిఫైడ్ పథకం ఫలితంగా అనేక నకిలీ ఖాతాలకు బ్లూ టిక్ వచ్చిందట.. మారియో, గేమింగ్ కంపెనీ వాల్వ్‌కు చెందిన నకిలీ ఖాతా, లెబ్రాన్ జేమ్స్ కోసం మరొక ఫేక్ ఎకౌంట్, డొనాల్డ్ ట్రంప్ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఎవరో నకిలీ జార్జ్ డబ్ల్యూ బుష్ ఖాతాలను కూడా సృష్టించారు… అంతేకాదు అందులో అభ్యంతరకరమైన సందేశాలను పోస్ట్ చేసారు, మరొక నకిలీ టోనీ బ్లెయిర్ ఖాతాను సృష్టించారు.. ఈ నకిలీ ఖాతాలన్నీ కొంతకాలం ప్లాట్‌ఫారమ్‌లో ధృవీకరించబడ్డాయి.. కానీ, చివరికి అవి సస్పెండ్ చేయబడ్డాయి. కొన్ని ప్రముఖ ఖాతాలు మొదట్లో తమ ఖాతా హ్యాండిల్ పేరు క్రింద ‘అధికారిక’ ట్యాగ్‌ని చూపించాయి. ప్రఖ్యాత టెక్ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ ఈ కొత్త ట్యాగ్‌ని రూపొందించిన స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశారు. న్యూస్‌రూమ్‌లు, దేశాధినేతలు మొదలైనవాటితో సహా అనేక ప్రముఖ ఖాతాల్లో ట్యాగ్ త్వరలో కనిపించింది. ఏదేమైనా.. ట్విట్టర్‌లో బ్లూటిక్ ఉండాలంటే మాత్రం ఇండియన్ కరెన్సీలో చెల్లించేవారు నెలకు రూ.719 సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లూటిక్ వరకే చార్జీలు అనుకున్నా.. రానురాను ఖాతా ఉంటే చాలు చార్జీలు వసూలు చేయాలన్న యోచనలో ట్విట్టర్ చీఫ్ ఉన్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!