Telangana: టెన్త్ పరీక్షలు.. టెన్షన్ పడుతున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.
తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019 అకాడమిక్ ఇయర్‌లో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్‌ల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. పరీక్షలు నిర్వహించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
అయితే ఈ ఏడాది మే నెలలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు గత రెండేళ్లుగా పెద్దగా క్లాస్‌లు జరగలేదు. ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే జరిగాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపు సిలబస్ పూర్తి చేయాలి సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈసారి విద్యాశాఖ ఉన్నతాధికారులు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. దాంతో సిలబస్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
గతంలో ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ వరకు జరిగేవి. డిసెంబర్ నుంచే ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్ నుంచి దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక లేదు.దాంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. పైతరగతులకు టెన్త్ క్లాస్ బేస్‌మెంట్ కాబట్టి మార్కులు తగ్గితే ఎలా అనే గందరగోళంలో ఉన్నారు. మార్చి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కానీ చాలా చోట్ల ఇంకా సిలబస్ కూడా పూర్తి కాలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి.. టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!