Site icon NTV Telugu

Hyderabad: ఎమ్మెల్యే ఫ్రెండ్‌ అంటూ స్టిక్కర్‌.. చలాన్ వేసిన పోలీసులు

Mla

Mla

వాహనాలపై నెంబర్ ప్లేట్లు చూస్తుంటాము. నెంబర్ ప్లేట్ తో సహా తల్లిదండ్రులు వారి పిల్లల పేర్ల రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల పేర్లు రాసుకుంటుంటారు. నెంబర్ ప్లేట్ అంటే కొందరు లక్కీ నెంబర్ తీసుకోవడం మనం చూస్తుంటాము. ఆవాహనాలను చాలా ఇష్టంగా చూసుకుంటాం. అంతే కాదు మనకు నచ్చిన హీరో హీరో యిన్లు పేర్లు.. ఫోటోలు కూడా దర్శనమిస్తుంటాయి. కానీ ఓప్రబుద్ధుడు తన బైక్ పై ఓ పేరును రాసుకున్నాడు. అంతే కాదు అతను నా ప్రెండ్ అంటూ రాసాడు.

బైక్ అడ్డంగా పార్క్ంగ్ చేసివున్న, మద్యం సేవించి వున్నా సిగ్నల్ క్రాస్ చేసిన దేనికైనా సరే పోలీసులు చలాన్ విధింస్తారు ఇది రూల్‌.. అలాంటిది త‌ను అలా బైక్ పై స్టిక్క‌ర్ పెట్టు కోవడంతో అత‌నికి ఎవ‌రు ఆప‌ర‌ని, ఏం చేసిన ప‌ట్టుకోర‌ని అనుకున్నాడో ఏమో.. నేను ఎమ్మెల్యే ప్రెండ్ అంటూ బైక్ పై స్టిక్క‌ర్ అతికించుకున్నాడు. అతనికి పోలీసులు అంటే భ‌యమో.. లేక ఎమ్మెల్యే అంటే అభిమాన‌మో తెలియ‌దు కానీ.. ఎంత ఎమ్మెల్యే ప్రెండ్ అయితే మాత్రం బైక్ పై స్టిక్క‌ర్ అతిరించి బయట తిరగం స్టార్ట్ చేశాడు. తనకు ఎమ్మెల్యే పై వున్న అభిమానాన్ని అంతగా చాటుకున్నాడు. ఏది ఏమైనా ఆ స్టిక్క‌ర్ కాస్తా.. చార్మిన్
పోలీస్టేషన్ పరిధిలో ద‌ర్శ‌మిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత‌ని బైక్ పై చలాన్ వేశారు.

తనకు అభిమానమో? లేక భ‌య‌మో? ఏదై ఏమైనా బైక్ పై మాత్రం అలా వుండ‌టం నేర‌మే క‌దా.. అందుకే ఇలాంటి వెత‌కారాల‌కు పోకుండా వుంటే మంచిదని పలువురు అంటున్న‌నారు. పోలీసుల ప‌నికి స‌భాష్ అంటూ షెల్యూట్ కొడుతున్నారు. పోలీసులకు సామాన్యుడైనా .. ఏ ఎమ్మెల్యే ప్రెండ్ అయినా ఎవరైనా ఒక్కటే అంటూ ఈ సంఘటనే నిదర్శనమని చెబుతున్నారు. ఇంత‌కే ఆ ఎమ్మెల్యే ఎవ‌రు? ఎమ్మెల్యే.. ఇత‌ను నిజంగానే ప్రెండ్ ? ఆ.. లేకా.. పోలీసులు ప‌ట్టుకోకుండా.. చ‌లానా విధించుకోకుండా ఇలా ప్లాన్ వేసాడా అనేది ఇంకా వివ‌రాలు తెలియ‌రాలేదు.

అయితే.. గతంలో.. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చార్జిషీట్లు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే మునుపటిలాగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో వాహనాలపై స్థాయిని తెలియజేస్తూ స్టిక్కర్లు వేస్తున్నారని, వాహనాల అద్దాలపై స్థాయిని పేర్కొంటూ ఎవరు స్టిక్కర్లు అంటించ రాదని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను అందరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ పేర్కొన్నవిషయం తెలిసిందే..

AR Rahman: ఏఆర్ రెహ్మాన్ భావోద్వేగ లేఖ.. ఇంతకీ అందులో ఏం రాశాడంటే..?

Exit mobile version