Stephen Raveendra: గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని సైబరాబాద్ సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అయితే.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12శాతం నేరాలు తగ్గాయని తెలిపారు. ఇది కానిస్టేబుల్ నుండి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే సాధ్యం అయిందన్నారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ కూడా సైబరాబాద్ పోలీస్ సమర్థంగా నిర్వహించామని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు…మూడు సార్లు ప్రధాని పర్యటన జరిపారు, సైబరాబాద్ పోలీస్ లు సమర్థంగా పని చేసి.. ఎక్కడా సమస్యలు రానివ్వలేదని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో లో అన్ని పండుగలు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగాయని గుర్తుచేశారు.
Read also: Dhamaka Movie Review: ధమాకా రివ్యూ
2010 నుండి పెండింగ్ లో వున్న 80శాతం కేసులు దర్యాప్తు పూర్తి చేసామని తెలిపారు సీ పీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఏడాది 27322 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయని అన్నారు. 79 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసామన్నారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 13 మంది పై రౌడీషీట్ లు తెరవడం తో పాటు, 849 మంది పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామన్నారు స్టీఫెన్ రవీంద్ర. గత ఏడాది తో పోలిస్తే… రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని, ఈ ఏడాది నాలుగు మాత్రమే నిజమైన అత్యాచారాలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్నీ పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి జరగాయన్నారు.
Read also: Digvijay Singh: చేతులు జోడించి విజ్ఞప్తి.. కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయండి
గత ఏడాది తో పోలిస్తే..సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని అన్నారు. గత ఏడాది కన్నా..996 కేసులు అదనంగా నమోదు అయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆన్లైన్ లో 20 లక్షల 96 వేల 961 చలాన్స్ వేశారని, దీని విలువ 96 కోట్ల 64 లక్షలు ఉందని, స్పాట్ లో 6 లక్షల 8 వేల చలాన్స్ వేశాం.. దీని విలువ 24 కోట్ల 91 లక్షలు అని వెల్లడించారు. 3228 యాక్సిడెంట్ కేసుల్లో 749 మంది చనిపోయారని, 55,175 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 979 మందిని జైల్ కి పంపామమన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల ద్వారా 15 కోట్ల 76 లక్షల ఫైన్స్ వేశామని, 32,238 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశామని సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
18 Pages MovieReview: 18 పేజీస్ రివ్యూ
