Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు.
ఈ సేవలకు ప్రతిఫలంగా డాక్టర్ నమ్రత ఏజెంట్లకు భారీగా నజరానాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా నమ్రతకు మహిళలతో కూడిన విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది.
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
పోలీసుల ప్రకారం, నమ్రత తన నెట్వర్క్‌ను విస్తరించడానికి పలు జిల్లాల్లో IVF కోసం ఉచిత క్యాంపులు నిర్వహించేది. క్యాంపులకు వచ్చిన దంపతులకు “IVF ద్వారా పిల్లలు కలుగుతాయి” అని నమ్మబలికేది. అయితే, IVF బదులు వారిని సరోగసికి రెఫర్ చేసి మోసం చేసేది. సరోగసి కోసం దంపతుల నుండి ₹30 లక్షల నుండి ₹50 లక్షల వరకు వసూలు చేసేది.
శిశువుల క్రయ విక్రయాల మోసం ఈ మోసపూరిత ప్రక్రియలో భాగంగా నమ్రత.. పిల్లలను కొనుగోలు చేసేది. వాటిని సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా చూపించి దంపతులకు అప్పగించేది. ఈ విధంగా అనేక కుటుంబాలను భారీగా మోసం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు ప్రస్తుతం ఈ నెట్వర్క్ వ్యాప్తి, ఆర్థిక లావాదేవీలు, మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సహచరులపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక బహిర్గతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Nitin Gadkari: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కొనియాడిన నితిన్ గడ్కరీ..
