తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరత మాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధూల్ పేట్ , జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ, మీదుగా హనుమాన్ టేకిడీ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది శోభాయాత్ర. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. సీసీ కెమేరాలు, డ్రోన్ కెమేమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.
తాజాగా ధూల్ పేట్ కి చేరుకుంది శ్రీరామ శోభయాత్ర.ఈ శోభాయాత్రలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలతో శోభాయాత్ర వీధులు హోరెత్తుతున్నాయి.