Srinivas Goud : తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లకు మానవత్వం ఉందా? వాళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డ అయిన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోపన్న అమర్ రహే అంటుంటే, తన భర్త గోపినాథ్‌ను గుర్తు చేసుకొని మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటారా తుమ్మల నాగేశ్వరరావు? కమ్మ సామాజిక వర్గం ఓటు వేస్తే గెలిచిన తుమ్మల, అదే వర్గానికి చెందిన నేత గోపినాథ్ సతీమణిని డ్రామా అంటారా? అని ప్రశ్నించారు. మాగంటి సునీతకు మంత్రుల వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల మాటలను తెలంగాణ ఆడబిడ్డలు గమనించాలి అని ఆయన వ్యాఖ్యానించారు.
Young Couple Die: లాడ్జిలో అగ్ని ప్రమాదం.. అనుమానస్పద స్థితిలో 25 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు..
అలాగే, ప్రెస్ మీట్ సమయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మంత్రుల పక్కనే కూర్చున్నా, ఆడబిడ్డ అవమానింపబడుతుండగా మౌనంగా ఉన్నారని గౌడ్ విమర్శించారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పార్టీలకతీతంగా అందరం బాధ పడ్డామని, ఇప్పుడు మాగంటి సునీత తన భర్తను గుర్తుచేసుకొని ఏడుస్తుంటే దాన్ని డ్రామా అంటారా? ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. మాగంటి సునీత భావాలను దెబ్బతీసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Tollywood Visual Effects: హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్.. టాలీవుడ్ సినిమాల్లో కొత్త ట్రెండ్.?