Srinivas Goud Comments On BJP: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని, కేసీఆర్ సర్కార్ కులవృత్తులను కాపాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచుకుంటున్నామని, 4 కోట్ల 20 లక్షల ఈత మొక్కల్ని పెంచామని అన్నారు. గౌడ సోదరులను ఆదుకునేందుకు నీర పాలసీ తీసుకొచ్చామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కన్నా, తెలంగాణ ఉద్యోగులకే ఎక్కువ జీతభత్యాలు అందుతున్నాయని.. ఒక్క కేసీఆర్ సర్కార్‌కే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పని చేసే ఉద్యోగులు ఉండడం వల్లే.. జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అంశాల్లో వరుస అవార్డులు అందుతున్నాయన్నారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే రీతిలో సానుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు.
Physical Harassment: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష
కేవలం ఉద్యోగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఔన్నత్యం స్పష్టమవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17670 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే మరో 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి కానుందని పేర్కొన్నారు. క్రీడాకారులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని.. గెలుపోటములను సమంగా స్వీకరించాలని సూచించారు. నిజామాబాద్‌కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సుమారు రూ. 20 కోట్లు విలువ చేసే 600 గజాల స్థలాన్ని అందించిందని, మరో క్రీడాకారిణి ఇషాసింగ్‌కు కూడా ప్రభుత్వ పరంగా స్థలం అందజేశామని అన్నారు.
Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..