D. Sridhar Babu: అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ‘విక్టరీ బెల్’.. ప్రారంభించిన శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Sridhar Babu: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘విక్టరీ బెల్’ ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రోగులు అధైర్యపడకూడదన్నారు. ఆత్మవిశ్వాసమే కొండంత బలమని తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విక్టరీ బెల్ ను ఆవిష్కరించడం ఒక ముఖ్యమైన ఘట్టం అన్నారు. ఇది ఆసుపత్రిలోని ఆంకాలజీ యూనిట్లలో జరిగిన పోరాటాలకే కాకుండా ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణాన్ని నిర్వచిస్తుందన్నారు. విజయం, పట్టుదల స్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతికూల పరిస్థితులపై ప్రబలమైన మానవ స్ఫూర్తికి శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పీ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ విజయ గంట నుంచి వచ్చే శబ్దం క్యాన్సర్ ను జయించిన వ్యక్తి ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుందన్నారు.
Read also: Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసు.. దర్యాప్తులో సంచలన నిజాలు
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
ఇది వారికి వారి ప్రియమైన వారికి చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తుందన్నారు. శ్రావ్యమైన రింగింగ్ సౌండ్ చికిత్సలో ఉన్నవారిలో ఆశను పదిలపరుస్తుందని తెలిపారు. క్యాన్సర్ చికిత్సను పూర్తి చేసుకున్న రోగులు విక్టరీ బెల్ మోగించే అవకాశం ఉందన్నారు. ఇది వ్యక్తిగత విజయాన్ని ప్రతిధ్వనిస్తుందన్నారు. ఇతరులకు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుందన్నారు. ప్రతీ క్యాన్సర్ రోగి విజయం వెనుక ధైర్యం, ఆశ, బలంతో కూడిన కథ ఉంటుందన్నారు. ఇది శక్తివంతమైన రిమైండర్‌గా పని చేస్తుందన్నారు. ఇది క్యాన్సర్ సంరక్షణలో పురోగతితో పాటు సమగ్ర విధానం ప్రాముఖ్యతను నొక్కి చెప్తుందన్నారు. వైద్య ప్రక్రియలో భావోద్వేగం, మానసిక అంశాలను గుర్తించడం ముఖ్యమన్నారు. అపోలో క్యాన్సర్ హాస్పిటల్ కారిడార్ లో విక్టరీ బెల్ ప్రతిధ్వనిస్తుండగా.. సవాలుతో కూడిన ముగింపు అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. ఆశావాదంతో నిండిన సరికొత్త జీవితం, క్యాన్సర్ రహిత భవిష్యత్తును తెలియజేస్తుందని తెలిపారు. ఇది ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ అందిస్తుందన్నారు. క్యాన్సర్ ప్రయాణంలో ఈ విజయాలను పెద్దది, చిన్నది అనే తేడా లేకుండా జరుపుకునే వాతావరణాన్ని సృష్టించేందుకు అపోలో నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Vijay Varma : తమన్నా తో పెళ్ళెప్పుడు..?.. ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన విజయ్ వర్మ..
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..