ఏడేళ్ల తెలంగాణ…ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ సాధన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నది. 2018 వ సంవత్సరంలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరింత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. 1969 లో తెలంగాణకోసం ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఉద్యమం ప్రారంభం అయింది. ఎందరో ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత 2001 ఏప్రిల్ 21న డిప్యూటి స్పీకర్‌గా కేసీఆర్ రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2009 నవంబర్ 29 న కేసీఆర్ ఆమరణదీక్షకు దిగడంతో ఉద్యమం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మ సాగర్ వంటి ఎన్నో ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి విషయంలో మిగతా రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతున్నది. అతి తక్కువ కాలంలోనే మిగులు బడ్జెట్ సాధించిన రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని పక్కన పెట్టకుండా అందరికి సమానమైన హక్కులు కల్పిస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది తెలంగాణ రాష్ట్రం.
Also Read
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!