Special Sanitation Drive: ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని, ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దం పట్టేలా చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. యువత మరియు మహిళలు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చివరి రోజున గ్రామసభ నిర్వహించి పారిశుధ్య కార్మికులను సన్మానించాలని సూచించారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడం, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో గ్రామ పంచాయతీల పాలనపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. . ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రోడ్లను శుభ్రం చేయడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు.
Read also: Grammys 2024: సంగీత సమరం మొదలు.. గ్రామీ అవార్డ్ కు నామినేట్ అయిన మోడీ
ప్రత్యేక అధికారుల సంపూర్ణ హక్కులు..
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన సాగించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారికి గ్రామంపై పూర్తి బాధ్యత, హక్కులు ఉంటాయని, ప్రత్యేక అధికారులు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకుని పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.
Read also: Sandeep Reddy Vanga: నెల రోజుల్లో ఆ సినిమా పనులు షురూ…
మేడారంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలి..
మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అదే సమయంలో జాతరకు ప్లాస్టిక్ తీసుకురాకుండా భక్తులకు అవగాహన కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే జాతరలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల ప్రత్యేక అధికారులు తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని మంత్రి సీతక్క అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి బల్క్ తాగునీటి సరఫరా జరుగుతుందని, గ్రామంలో అంతర్గత సరఫరా బాధ్యతను గ్రామ పంచాయతీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు రూ.కోటి నిధులు కేటాయించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో అవసరమైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Ram Mandir : 11 రోజుల్లో రూ.11 కోట్ల విరాళాలు.. మొక్కులు చెల్లించుకున్న 25 లక్షల మంది భక్తులు