NTV Telugu Site icon

BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే

Midi Arjun

Midi Arjun

ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆక‌ర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. ర‌థం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని స‌వారి చేస్తున్న‌ట్లుగా క‌ళాకారులు చిత్రించారు. జూలై 1న న‌గ‌రానికి వ‌చ్చిన న‌డ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అంద‌రికి ఆశ‌క్తి కరంగా మారింది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ రెండూ ఆయనేవ్యహరిస్తున్నారని కళాకారులు వేసిన ఈ పెయింటింగ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ పెయింటింగ్ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జెపి న‌డ్డా. మోడీ పెయింటింగ్ అర్థాన్ని ఎగ్జిబిషన్ ఇన్చార్జి రాకేష్ రెడ్డి వివరిస్తూ.. మహాభారతంలో కృష్ణుడు రథాన్ని స్వారీ చేస్తూ అర్జునుడి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారని.. ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ అధర్మంపై ధర్మం గెలిచేలా చేయడం దాని సారాంశమని గుర్తుచేశారు. దీనికి సారూప్యంగా కలియుగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తానే కృష్ణుడు.. అర్జునుడి అవతారాలను పోషిస్తూ భారత ప్రగతి చక్రాన్ని అభివృద్ధి.. సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారని అర్థం. ఇదే పెయింటింగ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పెయింటింగ్లో రథం వెనకవైపున మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కీలకమైన విధాన నిర్ణయాలు లోగోల రూపంలో ఉన్నాయని వివరించారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మల్చడంలో ఆయ చేస్తున్న కృషి ఈ పెయింటింగ్లో కనిపిస్తుందన్నారు. ఈనేప‌థ్యంలో.. మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, ఉజ్వల్ యోజన, డిజిటల్ ఇండియా, ఖేలో ఇండియా, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం, హర్ ఘర్ నల్ పానీ… ఇలాంటి అనేక పథకాలను పెయింటింగ్లో చిత్రీకరించారు.

IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే

Show comments