NTV Telugu Site icon

Son Killed Mother: దారుణం.. ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..

Dun Kild Mothers

Dun Kild Mothers

Son Killed Mother:హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన సంచలనంగా మారింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం తన భార్య, స్నేహితుడితో కలిసి ఆమెను హత్య చేశాడు కసాయి కొడుకు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు

సుగుణమ్మ తన కుమారుడు అనిల్‌, కోడలు తిరుమలతో కలిసి రామంతపూర్‌లో నివసిస్తోంది. సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇంటిని కొడుకు, కోడలు అమ్మాలనుకున్నారు. కానీ సుగుణమ్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు కొడుకు. తల్లి ఆస్తిని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడు. కానీ దానికి తల్లి నిరాకరించడంతో ఆమెను చంపేందుకు భార్య, అతని స్నేహితుడితో ప్లాన్ వేశాడు. ఆస్తికోసం ఏకంగా తల్లినే హత్యచేసేందుకు ప్లాన్ వేసుకున్నారు ముగ్గురు. అయితే ఆ టైం రానే వచ్చింది. తల్లి సుగుణమ్మ ఇంట్లో ఉండగా బయట ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు ఆమెపై దాడి చేశారు. అతి కిరాతకంగా హత్య చేశారు. ఏమీ తెలియనట్లు ఏడుస్తూ బయటకు వచ్చి సుగుణమ్మ చనిపోయిందంటూ నాటకం ఆడారు.

Read also: MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!

దీంతో స్థానికులు అందరూ పరుగుల సుగుణమ్మను చూసేందుకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అయితే బంధువులకు సుగుణమ్మ గురించి చెప్పగా అందరూ హుటా హుటిని ఘటనాస్థలానికి వచ్చారు. అయితే అనిల్ ఏడుస్తూ తల్లి చనిపోయింది అంటూ అంత్యక్రియలను ఏమీ లేకుండా పూర్తి చేయాలని కంగారు పడటంపై బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిని ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. దీంతో.. మృతురాలి కుమారుడు, కోడలు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Mahesh Babu: రీజనల్ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లేస్తుందా?