NTV Telugu Site icon

Smita sabharwal: తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు.. స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్

Smitha Sabarwal

Smitha Sabarwal

Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో, మహిళలు తీవ్ర ప్రమాదంలో తాళ్ల సహాయంతో బావిలోకి దిగడం కనిపించింది. ఆ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి మంచినీటి కోసం బావిలోకి దిగింది. తమ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. బావిలోకి దిగుతుండగా అందులో పడిపోతానేమోనని భయపడ్డానని, కానీ బతకడానికి నీరు అవసరమణి అందుకే ప్రాణాలు తెగించి నీటికోసం తాళ్ళు కట్టుకుని బావిలోకి దిగాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీరు అందించాలని గ్రామస్తులు వేడుకున్నారు.

అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని సంబంధించిన వీడియోను స్మితా సబర్వాల్ చలించిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన స్మిత..’ఒకే దేశం, విభిన్న జీవితాలు. విధి ఎంత విచారకరం’ అని రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేస్తుందన్నారు. పటిష్టమైన ఇంజనీరింగ్ ప్రకృతి విపత్తును మార్చగలదని చెప్పబడింది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు కోటి ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకొచ్చిందన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొన్నారని ఆమె ట్వీట్ చేశారు. స్మితా సబర్వాల్ ట్వీట్‌పై నెటిజన్లు పాజిటివ్‌ గా స్పందిస్తున్నారు. తెలంగాణలో ఏ గ్రామంలోనూ నీటి కొరత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్‌కు అవకాశం ఇస్తే ఈ గ్రామాలకు ఇంటింటికీ నీళ్లు అందేలా చూస్తారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Former died: ధ్యాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం.. నిద్రిస్తున్న రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్‌