CM Revanth Reddy : తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ) పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, డిసెంబర్ 9, 2027 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ కేవలం నల్గొండ జిల్లా అవసరాలకే కాకుండా మొత్తం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమని, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా నీటిని అందించే అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ పూర్తిని ఏ విధంగానూ వాయిదా వేయరాదని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు.
China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..
శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సీఎం, అటవీ శాఖ అనుమతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్‌లోనే నిధులు అందజేస్తుందని హామీ ఇస్తూ, పనుల్లో అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు.
సొరంగం పనులను చేపట్టే కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను వెంటనే సిద్ధం చేసుకోవాలని, ఒక్కరోజు ఆలస్యం జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగిపోకుండా చూడాలని హెచ్చరించారు. డిసెంబర్ 9, 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తుది గడువుగా ప్రకటించారు.
US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్‌పింగ్” ఫోటో..