TRS MLAs Purchase Case: తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది. నోటీసులు అందుకున్న నలుగురికి ఒకే ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ తేవాలని నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన నోటీస్ ను పోలీసులు సర్వ్ చేయడం పై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. బీఎల్ సంతోష్ , శ్రీనివాస్ కు ఇచ్చిన నోటీసుల్లో 94498…. ఇద్దరినీ ఒకే ఫోన్ నంబర్ , ఒకే IMEI నెంబర్ ఉన్న ఫోన్ తీసుకురమ్మని నోటీస్ జారీ చేయడంతో గందరగోళంగా మారింది.
Read also: Tollywood: ముదురుతున్న ‘వారసుడు’ వివాదం.. రిలీజ్ వాయిదా పడుతుందా?
ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. సిట్ పిటిసన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది. డిల్లీ పోలీసులకు విచారణకు సహకరించడం లేదని సిట్ పిటీసన్ దాఖలు చేశారు. డిల్లీలో ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు అనుమతించడం లేదని సిట్ పేర్కొన్నారు. దర్యాప్తుకు అంతరాయం కలిగించవద్దని డిల్లీ సీపీని ఆదేశించాలన్న పిట్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత ప్రేమెందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీఎల్ సంతోష్, శ్రీనివాస్ ల నోటీసులపై స్టే ఇవ్వాలని కోరూతు పిటిషన్లో పేర్కొన్నారు. పిటీషన్ లో ఎనిమిది మందిని పిటిషనర్ ప్రతివాదులు చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డిజిపీ, సైబారాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీపీ రాజేంద్రనగర్, SHO మొయినాబాద్, సెంట్రల్ హోమ్ ఎఫైర్స్, సిబిఐ, రోహిత్ రెడ్డి లను పిటిషనర్ ప్రేమెందర్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారికి సిట్ ఇల్లీగల్ నోటీసులు ఇచ్చారని పిటిషన్ పేర్కొన్నారు. కేసుకు సంబంధం లేని వారికి నోటీసులిచ్చి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న పిటిషనర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్టే విధించాలనిపిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం 2:30కి విచారణ జరపనుంది.
Narendra Modi: వాటికి ముడిపెట్టొద్దు.. మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన
