Bhadrachalam: సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam: శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య, సీతమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. స్వామి, అమ్మవార్లకు విలువైన కానుకలు సమర్పిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ సీతమ్మవారికి అరుదైన చీరను తయారు చేశారు. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువు ఉంటుంది. బంగారం, వెండి, ఎరుపు రంగులతో దీన్ని రూపొందించడానికి 18 రోజులు పట్టిందని విజయ్ తెలిపారు. దీనికి గాను రూ.48 వేలు ఖర్చయిందని.. ఈ నెల 16న చీరను భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.
Read also: KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన.. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ఇక సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుంచి సీతమ్మకు పెళ్లి చీర వెళ్తుంది. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రతి సంవత్సరం పెళ్లికి చీర పంపడం ఆనవాయితీ. ఈసారి తన చేనేత నైపుణ్యాన్ని ఉపయోగించి మగ్గంపై సీతారాముల కళ్యాణం జరిగేలా చీరను నేసాడు, చీర అంచుల్లో భద్రాద్రి దేవాయణంలోని సీతారాముల ప్రతిరూపాలు ఉన్నాయి. చీర అంతా శంకు, చక్ర నామాలతో పాటు బోర్డర్‌లో జైశ్రీమ్ అనే అక్షరాలు కనిపించేలా చీరను తయారు చేశాడు. ఆరు రోజుల పాటు కష్టపడి ఈ చీరను తయారు చేసినట్లు హరిప్రసాద్ వెల్లడించారు. 800 గ్రాముల బరువున్న ఈ చీరలో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలను ఉపయోగించారు. ఈ చీరలో సీతారాముల కళ్యాణ చిత్రం నేయడం విశేషం. ఈ చీరను ఇవాళ ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి భద్రాద్రి దేవస్థానానికి అందజేస్తానని హరిప్రసాద్ తెలిపారు.
Gold Price Today : పరుగులు పెడుతున్న పుత్తడి ధరలు.. అదే దారిలో వెండి.. ఎంతంటే?
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!