NTV Telugu Site icon

Singur Dam: నిండుకుండలా సింగూరు..జలకళ

Singur Dam

Singur Dam

భారీవర్షాలు వారం నుంచి తెలంగాణ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నిండు కుండలామారి జలకళను సంతరించుకుంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక,మహారాష్ట్రాల నుండి భారీగా వరద నీరు సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిచేరుతుంది.దీనికి తోడు సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.గత వారం రోజులుగా రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం రోజు రోజుకు భారీగా వచ్చి చేరుతోంది.

Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల 955 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు లో 22.417 టీఎంసీల నీటి నిల్వగా నమోదైంది.సింగూర్ ప్రాజెక్టులోకి మరో నాలుగు,ఐదు టీఎంసీల వరద నీరు వచ్చిచేరితే ప్రాజెక్టు గేట్స్ ఎత్తి దిగువన ఉన్న ఘనపూర్,నిజాంసాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామన్నారు ఇరిగేషన్ అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుందన్నారు అధికారులు.

వర్షాలు ఇలాగే కురిస్తే వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మునిపల్లి, ఝరాసంగం, రాయికోడ్‌, న్యాల్‌ కల్‌, మనూరు, నాగల్‌ గిద్ద, రేగోడు, వట్‌ పల్లి మండలాలతో పాటు పుల్కల్ లో భారీ వర్షం నమోదు కావడంతో ఆ వరద నీరంతా ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో కలుస్తుంది. వరద నీటి ప్రవాహం రాకముందు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలకు దాదాపుగా మూడు టీఎంసీలకు పైగా కొత్త నీరు వచ్చి చేరింది. వానాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులో సగం టీఎంసీల నీరు ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పరిసరాలు నీటి అలలతో కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రాజెక్టు దిగువ ఉన్న వ్యవసాయ సాగుకు,అలాగే తాగునీటి అవసరాలకు ఎలాంటి నీటి ఢోకా లేదన్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలోకి నీరుచేరుతుందన్నారు.దింతో మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు,రైతులు,పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.

Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ