NTV Telugu Site icon

Siddipet Traffic ACP: నేను తాగలేదు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ

Siddipet Traffic Acp

Siddipet Traffic Acp

Siddipet Traffic ACP: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. ఇది వాహనదారులపై పోలీసుల రూల్స్‌. మరి ఫుల్‌ గా మద్యం సేవించి పోలీసులే వాహనం నడిపితే. అయితే ఏంటి ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు నిరూపించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో ఓ ట్రాఫిక్‌ ఏసీపీ అదుపులో తీసుకున్న ఘటన దానికి నిదర్శనం. ఓ ట్రాఫిక్‌ ఏసీపీ మద్యం తాగడమే కాకుండా.. పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు. బ్రీత్‌ ఎనలైజర్‌ చేయాలని తెలుపగా నేను తాగలేదు.. ఎందుకు చేయాలని అని వాదించాడు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఈ హంగామా చోటుచేసుకోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ లో చోటుచేసుకుంది.

Read also: Astrology: నవంబర్ 14, గురువారం దినఫలాలు

హైదరాబాద్ లోని మధురానగర్ లో అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో యూనిఫాంలో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసు అతడి వాహనాన్ని ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊపిరి పీల్చుకోమన్నారు. అందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ నిరాకరించాడు. అక్కడితో ఆగకుండా తనది పోలీస్ డిపార్ట్ మెంట్ అంటూ అక్కడున్న వారిపై కూడా మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Tonk Violence: హింసాకాండ.. బూడిదైన 100 వాహనాలు.. 60 మంది అదుపులో

Show comments