KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫామ్ హౌస్ దగ్గరే టెంట్ వేసుకుని వంటా- వార్పు నిర్వహిస్తామని లేఖలో నిర్వాసితులు పేర్కొన్నారు.
Read Also: Akhilesh Yadav: ఔరంగజేబు సమాధిపై వివాదం.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్ ఇదే..
అలాగే, తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెబుతున్నారు.. కానీ అదే విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదని మల్లన్న సాగర్ నిర్వాసితులు ప్రశ్నించారు. మా గురించి అసెంబ్లీలో ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు.