NTV Telugu Site icon

Harish Rao: ఆయకట్టుకు నీళ్లు అందించండి.. ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ..

Harish Rao

Harish Rao

Harish Rao: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న అంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మరో వైపు వర్షాలు పడక పంటలు వేయాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. రాజకీయాలు పెక్కనపెట్టి మిడ్ మానేరు నుంచి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి కాల్వల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్‌.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.

Read also: Trap with Police DP: డ్రగ్స్ తో మీ పిల్లలు పట్టుబడ్డారు.. పోలీసుల డిపీతో తల్లి దండ్రులకు ట్రాప్‌..

గతేడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక్ సాగర్‌లో 2.38 టీఎంసీలకు 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్‌లో 18 టీఎంసీలకు 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 10 టీఎంసీలు. ఒకవైపు రిజర్వాయర్లలో నీరు లేకపోవడం, మరోవైపు వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయ పరిస్థితితో రైతులు అవస్థలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల్లో సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. కావున రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంతానికి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులను కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు.
CM Revanth Reddy: 12 రోజలు పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..