సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో సరదాగా స్నేహితులు కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్లి ఫోటోలు దిగుతూ ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..
మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా బయటపడ్డ యువకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన యువకులలో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా ఉన్నారు.
Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ