NTV Telugu Site icon

KCR: వచ్చే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Kcr

Kcr

సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also: Telangana: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారుల నియామకం..

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ తెలిపారు. అందులో అనుమానమే లేదు.. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్ధం అయ్యింది.. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని పేర్కొన్నారు. పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలి.. అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి.. వీడిని లోపల వేయాలని తాము చూడమని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి.. నిర్మాణం చేయాలి.. పదిమందికి లాభం చేయాలని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో తాము మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే.. కానీ 90 శాతం ఎవరు అడగకున్న పనులు చేసి చూపించామని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: Tuvalu : ఈ దేశానికి భూమిపై నూకలు చెల్లాయి.. సముద్రంలో మునిగిపోనున్న తొలి డిజిటల్ కంట్రీ

Show comments