CM Revanth Reddy: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో రూ. 262.78 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుతో పాటు రూ. 20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే, రూ. 8.60 కోట్లతో RTA యూనిట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేశారు. ఇక, రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్- కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్- అక్కన్నపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Read Also: Naga Bandham : కుర్ర హీరో సినిమా కోసం 20 కోట్ల క్లైమాక్స్?
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే ప్రారంభమైందన్నారు. అలాగే, యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతా చారి బలిదానం చేశాడు అన్నారు. ఇక, త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ ఇచ్చామని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం యొక్క ముఖ్య లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
