Site icon NTV Telugu

Siddipet: కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్‌చల్..

Aghori

Aghori

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో మహిళా అఘోరీ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. హిందూ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది. మొదట్లో ఈ మహిళా అఘోరీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. కాగా.. కొన్ని రోజులు కనిపించకుండా పోయిన అఘోరీ.. గత రెండ్రోజులుగా తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇంతకుముందు.. ఈ అఘోరీ స్మశాన వాటికల్లో హంగామా చేసింది. ఒళ్ళు గగుర్పొడిచేలా పూజలు చేసేది.. అంతేకాకుండా అప్పుడే ఆరిన చితిపై కూర్చుని ఆ బూడిదను తన ఒంటిపై రుద్దుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అది చూసిన జనాలు భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.

Read Also: Donald Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాకు వస్తారు..

తాజాగా సిద్దిపేట జిల్లాలో మహిళా అఘోరీ ప్రత్యక్షమైంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద హల్‌చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. అయితే ఆమె దిగంబరంగా ఉండటంతో ఆలయ అధికారులు బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని సూచించారు. కాగా.. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసింది అఘోరీ. దీంతో.. ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..

Exit mobile version