Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్‌లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం తారవ్వ పంటనే కాకుండా, అదే ప్రాంతానికి చెందిన మరో 106 మంది రైతుల పంటలను కూడా అధికారులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Mali Bamako JNIM: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?
పంట నష్టపోవడంతో బాధలో ఉన్న తారవ్వకు ప్రభుత్వం అండగా నిలవడం రైతుల్లో నమ్మకాన్ని పెంచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ కాళ్లు పట్టిన ఘటనను గమనించి వెంటనే స్పందించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సివిల్ సప్లై శాఖ కట్టుబడి ఉందని, ఎవరూ నిరాశ చెందవద్దని అధికారులు హామీ ఇచ్చారు.
IAS Transfers : 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ముఖ్య విభాగాలకు కొత్త నియామకాలు
