అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా సీతారాంపల్లిలో చోటుచేసుకుంది. 95 వేలు మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన రాజు SBI బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకున్నాడు. కాగా.. అదే అలుసుగా చేసుకున్నాడు ఓ కేటుగాడు. రాజుకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ ప్రతినిధిని అంటూ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరాడు. రాజుతో మాటలు కలిపాడు ఆ కేటుగాడు. యాప్ డౌన్లోడ్ చేశాడు రాజు. OTP అడగగానే వెనకాముందు ఆలోచించకుండా రాజు చెప్పేశాడు. అంతే వెంటనే రెండు విడతలుగా మొత్తం 95 వేల రూపాయలు అకౌంట్ నుంచి మాయమయ్యాయి. నిర్ఘాంత పోయిన రాజు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
Imran khan: అమెరికాకు ఆ అవకాశం ఇవ్వలేదు