Basara IIIT: మెస్ లో ఫర్నిచర్ కొరత.. ట్విట్టర్ వేదికగా విద్యార్థుల ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ వివాదం చెలరేగింది. భోజన, బోధన, వసతి పరంగా భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేపట్టిన.. అదే తీరులో కొనసాగుతోంది. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ నెలకొన్న సమస్యలు మళ్లీ ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో ఫర్నిచర్ కొరత పై ట్విట్టర్ వేదికగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. మెస్ దుస్థితిపై స్పందించిన ట్రిపుల్ ఐటీ ఎస్. జీ. సీ. స్టూడెంట్స్ కింద కూర్చుని భోజనం చేసే ఫొటోలు సోషల్ వేదికగా పోస్ట్ చేసారు. వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామన్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది తీరు ఇదని.. మా పరిస్థతి ఏమీ మారలేదని దానికి సాంకేతంగా అనిపించే విధంగా విద్యార్థులు తమ ఆవేదనను వెల్లడించినట్లైంది. దీంతో ట్రిపుల్ ఐటీలో విధ్యార్థులకు ఎటువంటి వసతులు లభించడంలేదని తేటతెల్లం అయింది.
మరి దీనిపై ట్రిపుల్ ఐటీ అధికారులు, ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. రెండురోజుల క్రితం పీయూసీ విద్యార్థి సంజయ్ కిరణ్ మృతి చెందిన ఘటన మరువకముందే.. బాసర ట్రిపుల్ ఐటీలో ఈవివాదంలో మళ్లీరాజుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన సంజయ్.. 2020లో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందాడు. సంజయ్ తల్లిదండ్రులు శ్రీధర్, శ్రీలత వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో సంజయ్ చిన్న కుమారుడు. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజయ్.. జూన్ 20న పరీక్షలు రాసేందుకు వెళ్లి, అక్కడ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే స్వగ్రామానికి తిరిగొచ్చాడు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
నెలరోజులుగా అతడు జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలోనే ఉన్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినా ఉపయోగం లేకపోయింది. ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ అవుతుండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి, స్థానికంగానే చికిత్స అందించాలని తల్లిదండ్రులు భావించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు సంజయ్‌ను తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న శాబోతు సంజయ్‌కి ఫుడ్‌పాయిజనింగ్ కారణంగానే మరణించాడని.. అక్కడ భోజనం చేసిన నాటి నుంచే అనారోగ్యం బారిన పడ్డాడని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
జూలై 16 న బాసర ఆర్జీయూకేటీలో మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాసర ట్రిపుల్ ఐటీలోపల జరిగే సమాచారాన్ని ఎటువంటిదైనా సరే బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. మీడియాకు లోనికి అనుమతించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఫర్నిచర్ కొరతపై మంత్రి సబిత ఏమంటారో?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు