Site icon NTV Telugu

తెలంగాణలో షాకింగ్ సర్వే.. వారికి ఆ లక్షణాలు

తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 31,199 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

శనివారం మొత్తం 1,16,224 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,12,85,422 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జ్వరం, ఇతర లక్షణాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేలో ఎన్నో విభ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో 30 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. సర్వేకి వెళ్లిన సిబ్బందితో మాట్లాడిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది. జనంలో చాలామందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించి, వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను అందించారు. ప్రతి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ మంది ప్రైవేటు క్లినిక్ లను ఆశ్రయిస్తుండడంతో అవన్నీ లెక్కల్లోకి చేరడం లేదు.

Exit mobile version