Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చని భావించిన పోకిరీలకు షీ టీం షాక్ ఇచ్చింది. గణేష్ మండపాల వద్ద, నిమజ్జనం ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని గుర్తించి పట్టుకున్నారు.
PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ
షీ టీం ఇన్‌చార్జి లావణ్య మాట్లాడుతూ, “మహిళలు, యువతులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిమజ్జనం పూర్తయ్యే వరకు మా టీంలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తాయి. మహిళలు ఎలాంటి భయం లేకుండా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. ఉత్సవ వాతావరణంలో సురక్షిత వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చర్యల వల్ల పోకిరీలు వెనకడుగు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
