PM Modi: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎక్కువ పన్నులు విధించారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ట్యాక్స్‌లతో చిన్న పిల్లల టోపీలను కూడా వదలలేదని అన్నారు. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెస్సే కారణం అని అన్నారు. జీఎస్టీ శ్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని తెలిపారు. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని ప్రధాని చెప్పారు.
READ ALSO: Prakasham: తురకపాలెంలో ముప్పై మంది చనిపోవడం బాధాకరం- మాజీ మంత్రి అంబటి రాంబాబు
“GST అనేది స్వతంత్ర భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్కరణలలో ఒకటి… వాస్తవానికి, ఈ సంస్కరణలు దేశానికి మద్దతు, వృద్ధికి రెట్టింపునకు తోడ్పాటును అందిస్తాయి. ఒక వైపు దేశంలోని సామాన్య ప్రజలు డబ్బు ఆదా చేస్తారు.. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎనిమిది ఏళ్ల క్రితం GST అమలు ప్రారంభించినప్పుడు, అనేక దశాబ్దాల కల నిజమైంది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చర్చ ప్రారంభం కాలేదు. గతంలో కూడా ఈ చర్చలు జరిగేవి, కానీ ఎప్పుడూ ముందుకు కదల లేదు. ఇప్పుడు GST మరింత సరళంగా మారింది… సెప్టెంబర్ 22న, అంటే నవరాత్రి మొదటి రోజు సంస్కరణలు చేసిన జీఎస్టీ అమలు కానుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కచ్చితంగా ‘మాతృశక్తి’ దీవెనలతో చేసినవే. సకాలంలో మార్పులు లేకుండా, నేటి ప్రపంచ పరిస్థితిలో మన దేశానికి సరైన స్థానాన్ని ఇవ్వలేము. భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి తదుపరి తరం సంస్కరణలను చేపట్టడం చాలా కీలకమని నేను ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చెప్పాను. ఈ దీపావళి, ఛత్ పూజకు ముందు దేశ ప్రజలకు రెట్టింపు ఆనందం కలుగుతుందని నేను వాగ్దానం చేశాను” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
READ ALSO: NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !