తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న శశాంక్ గోయల్‌ను బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. గోయల్ ను కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు.. 1990 బ్యాచ్ కు చెందిన శశాంక్ గోయల్.. గతేడాది మే నెలలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.. మరోవైపు శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. గోయల్ రిలీవింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఈవో శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. తదుపరి సీఈవో కోసం ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది.. సీఈవో శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ జనవరి 18న ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే కాగా.. ఇంఛార్జి సీఈవోగా ప్రస్తుత అడిషినల్ సీఈవో బుద్ధ ప్రకాష్‌ను నియమించింది ప్రభుత్వం.