మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అధికార టీఆర్‌ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులు చనిపోతున్న సర్కార్‌కు పట్టడం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవండంటూ షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి,బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి,దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు.
Read Also: పాల్వంచ ఘటన నిర్భయ కేసు కన్నా దారుణం : వీహెచ్
మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా అంటూ విమర్శించారు. బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతుందా దొరా? పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి. అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
