Shanti Kumari as the new CS of Telangana: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. కాసేపట్లో దీనిపై కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే.. ఇప్పటి వరకు సీఎస్‌గా వున్న సోమేశ్ కుమార్‌ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేసి ఏపీ కేడర్‌కు అప్పగించడంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. సీఎస్ రేసులో రామకృష్ణారావు, శాంతి కుమారిలు పోటీపడగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారి వైపు మొగ్గుచూపారు. కాగా.. ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయితే.. దీనిపై కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.
Read also: Siva Kandukuri: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’కు అంత ధీమా ఏమిటీ?
అయితే.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసేందుకు సిద్దమయ్యారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సోమేష్ కుమార్.. రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.
Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం