Telangana Congress Senior Leader, Former Minister Shabbiar Ali Made Comments On SC,ST Reservations.
గిరిజన రిజర్వేషన్‌పై తెలంగాణలో హాట్‌టాపిక్ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన రిజర్వేషన్ పెంచాలని కోరుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన రిజర్వేషన్ పై గిరిజనులను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు దొంగ మాటలు మాట్లాడుతున్నారని, 16 ఏప్రిల్ 2017లో తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ బిల్లులు ప్రవేశ పెట్టారన్నారు. మేము కూడా మద్దతు పలికామని, కేసీఆర్ ఢిల్లీకి పంపినప్పుడు చెప్పా… ఇది డ్రామా అని, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుపై కేంద్రం కంటెంట్ పంపండి అని అడిగిందన్నారు.
లెటర్ పంపారు…కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు అని కేంద్రం చెప్పిందని, కేంద్రం మా దగ్గర ప్రతిపాదన లేదని అబద్దం చెప్పిందని, కేంద్రం అడిగిన వాటికి సమాధానం రాష్ట్రం ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖ రాశా కానీ పట్టించుకోలేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే కనీసం ఎక్నాలెడ్జ్ లెటర్ కూడా పంపలేదన్నారు. కేసీఆర్‌నీ నేను బిల్లుపై లోపాలు ఉన్నాయని అంటే.. ఆ బిల్లు వెనక్కి వస్తుందని నాక్కూడా తెలుసు అని కేసీర్ చెప్పారని ఆయన తెలిపారు.