Hyderabad Murders: శాంతి భద్రతలకు భాగ్యనగరానికి పెట్టింది పేరు. అయితే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయానక వాతావరణం నెలకొంది. వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లో 7 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయంటే హైదరాబాద్ లో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. ఏ నిమిషమంలో ఏం జరుగుతుందో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో 7 హత్యలు జరిగినా పోలీసులు అంటి ముట్టనట్టు ఉంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: PM Modi : నేడు ప్రధాని మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ
రెండు రోజుల వ్యవధిలో 7 హత్యలు, 2 హత్యా యత్నాలు నగరాన్ని రక్తసిక్తరంగా మారుతున్నాయ. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ కు దుండగులు హత్య చేశారు. అక్రమ సంబంధం కారణంగానే జాకీర్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రెండు రోజుల క్రితం ఓల్డ్ సిటీ శాలిబండ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. అదే రోజు శాలిబండ పరిధిలో వజీద్, ఫకృద్దీన్ లపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా యత్నానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ పరిధి తుకారం గేట్ పిఎస్ పరిధి అడ్డ గుట్టలో భార్య రోజాను హత్య చేసి భర్త పరార్ అయ్యాడు. మరుసటి రోజు అసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
Read also: Prajwal Revanna’s Brother: యువకుడిపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అత్యాచారం..! ఎమ్మెల్సీ సూరజ్ ఫైర్
కాచిగూడ పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. సనత్ నగర్ పరిధి భరత్ నగర్ లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్యచేశారు దుండగులు. రెండు వారాల క్రితం బాలపూర్ లో ముబారక్ సిగార్ అనే వ్యక్తిని వెంటాడి హత్య చేశారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో మరో దారుణ హత్య కలకలం రేపుతుంది. ఇప్పటికే ఆరు హత్యలతో బెంబేలెత్తున్న ప్రజలకు శనివారం తెల్లవారు జామున మరో హత్య జరగడంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 4 గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి దొంగగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు యజమనాని గుర్తించడంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు దొంగ. అయితే ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని చితకబాదడంతో కుప్పకూలిపోయాడు దొంగ. యజమానికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
అంతకుముందు రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ ఉండేది. రాత్రివేళల్లో ఎక్కువ నేరాలు జరగకుండా పోలీసులు తరచూ గస్తీ నిర్వహించారు. అయితే ఇప్పుడు పాతబస్తీ ప్రాంతాల్లో నిఘా కొరవడడంతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసుల గస్తీ ముమ్మరంగా ఉండేదని, నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు నిలకడగా ఉండేవని, ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయని వారు వాపోతున్నారు. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై పెట్రోలింగ్ లేకపోవడంతో రోడ్లపై దుండగులు కత్తులతో సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Mahesh Babu : రాజమౌళి తరువాత మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా..?