Serial Killer: నిజం చెప్పేవారిని కన్నా అబద్ధానికి విలువ ఎక్కువ అంటుంటారు కొందరు అది అక్షరాల నిజం. ఎందుకంటే ప్రజలు నిజం కన్నా.. అపద్దానికే విలువక ఎక్కవ ఇస్తారు కాబట్టి.. ఎవరైతే ముంచుతారో వారినే నమ్మ నిండా మునిగి లబోదిబో మంటుంటారు. అయితే ఇప్పుడు అలా కాకుండా కొత్తపద్దతి వచ్చింది. నమ్మని వారిని ముంచడమేకాదు.. వారిని చంపేంత దూరం వెళుతున్నారు కొందరు ప్రభుద్దులు. ఇప్పటి కాలంలో ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకుని మోసం చేసే బాబాలు, స్వాముల గురించి తెలిసిందే. అయితే ఇతను అంతకుమించి అనే చెప్పొచ్చు.
గుప్తనిధులు, ఉద్యోగాలు, మంచి అవకాశాలు.. ఇలాంటి అనేక రకాల కారణాలతో జనాలను మభ్యపెట్టి, మాయచేసి.. మోసం చేయడం.. ఆ తరువాత వారిని హత్య చేయడం ఇతని పని. ఆ నేరం అతనిపై పడకుండా తప్పించుకుని తిరగడం ఇతని పరిపాటిగా మారింది. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందిని హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్. ఈ విషయం తెలిసిన పోలీసులు షాక్ తిన్నారు. అయితే, ఇదంతా ఆథ్యాత్మికత, తాంత్రిక పూజల ముసుగులో చేయడం కలకలం రేపుతోంది.
Read also: Vijayakanth: ఆస్పత్రి నంచి కెప్టెన్ విజయ్‌కాంత్ డిశ్చార్జ్!
అమాయక ప్రజలను హత్యలు చేస్తూ దొరకకుండా తప్పించుకుంటున్నాడు. అయితే.. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎలా వెలుగు చూసింది అంటే.. హైద్రాబాద్ లో ఓ హత్య కేసుతో ఈ తాంత్రికుడి డొంక అంతా కదిలింది. ఈ కేసులో పోలీసులకు చిన్న క్లూ దొరికడంతో దాన్ని పట్టుకుని దర్యాప్తు చేస్తుంటే.. అసలు విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు హంతకుడు ఎవరో తేలడంతో పాటు.. అతను ఇప్పటికే 20 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని తేలడంతో పోలీస్ బాసులు షాక్ ఖంగుతిన్నారు. అంతేకాదు ఆ తాంత్రికుడి మీద ఇప్పటికే , నాగర్ కర్నూల్, ఏపీలోని పలు పోలీస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తించారు.
తాంత్రిక పూజలతో ఎర వేసి, వారిని తన మాటలతో నమ్మించి.. అదును చూసి వారిని చంపేయడం ఇతనికి మామూలుగా మారింది. ఇదంతా ఒక ఎత్తైతే.. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఓ కుటుంబంలోని నలుగురిని చంపేశాడు ఈ తాంత్రికుడు. ఇటీవల ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆ తరువాత అతను ఉద్యోగం రాకపోవడంతో ప్రశ్నించడంతో.. అతనిని కూడా చంపేశాడు. అయితే.. హైదరాబాద్ లో ఓ హత్య కేసు దర్యాప్తులో తాంత్రికుడికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.
Ponguleti Srinivas Reddy: సీఎం జగన్‌తో నాకు వ్యక్తిగత సంబంధాలు వేరు.. రాజకీయాలు వేరు..!