మంచిరేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. సుమన్ రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.. దీంతో.. గుత్తా సుమన్ ను మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు… మరోవైపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.. ఇక, ఫామ్‌హౌస్ పేకాట కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు అతడిని చంచల్ గూడ జైలులో ఉంచి దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణలో గుత్తా సుమన్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక, సుమన్ లిస్ట్ లో ఉన్న పలువురు ప్రముఖుల లిస్ట్ చూసి పోలీసులు షాక్ అయినట్టుగా తెలుస్తోంది.. సుమన్ ఫోన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉన్నాయట.. దీంతో.. వారితో సుమన్‌కు ఉన్న సంబంధాలపై అరా తీసేపనిలో పడిపోయారు పోలీసులు.. మరోవైపు.. నేను కేవలం హైదరాబాద్‌లోనే కెసినో ఆడివ్వలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.. గోవా, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్ లో కెసినో అడించినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడట.. బయట దేశాలకు వచ్చే వారిని మాత్రమే తీసుకెళ్లానని వెల్లడించిన సుమన్.. బర్త్ డే పార్టీ కోసం ఫామ్‌హౌస్ రెంట్‌కి తీసుకున్నట్టు పోలీసులకు వివరించాడు.. ప్రతిరోజు 600 మందికి కెసినో మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. సుమన్ పై ఇప్పటికే ఐదు ఫిర్యాదులు కూడా ఉన్నాయని.. తమను మోసం చేసారని బాధితులు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.. ఇక, గుత్తా సుమన్ బాధితులు ఎవరు ఉన్నా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.