Site icon NTV Telugu

Telangana Governor: రాజ్‌భ‌వ‌న్‌లో విమోచ‌న దినోత్సవ వేడుక‌లు.. గవర్నర్‌ సంచలన నిర్ణయం

Telangana Governor

Telangana Governor

Telangana Governor Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి (సెప్టెంబ‌ర్ 17)వ తేదీన తెలంగాణ విమోచ‌న దినోత్సవ వేడుక‌ల‌ను రాజ్‌భ‌వ‌న్‌లో నిర్వహించాల‌ని నిర్ణయించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 17వ తేదీన జాతీయ స‌మైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుండ‌గా, గ‌వ‌ర్నర్ రాజ్‌భ‌వ‌న్‌లో తెలంగాణ విమోచ‌న దినోత్సవాన్ని నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో.. ఈ విమోచ‌న దినోత్సవం సంద‌ర్భంగా ఉద్యమం పోరాటాలు.. త్యాగాలు అనే అంశంపై విశ్వ విద్యాల‌య విద్యార్థుల‌తో వ‌క్తృత్వ పోటీలు నిర్వహించ‌నున్నారు. ఇందుకుగాను.. సెప్టెంబ‌ర్ 17వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంటల నుండి ఈ పోటీలు నిర్వహించ‌నున్నారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ విమోచన ఉద్యమం.. త్యాగాలు.. ఇబ్బందులు అనే అంశంపై పోటీలు జరగనున్నాయి. దీంతో.. పాల్గొనేవారు సెప్టెంబర్ 16న సాయంత్రం 5 గంటలలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.ఇందులో భాగంగా.. 9542124646 నంబర్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్, rbhldelocutioncontest@gmail.com వెబ్‌సైట్‌కు పేర్లు పంపాలని.. 3 నిమిషాల పాటు స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుందని.. ముందుగా నమోదు చేసుకున్న 60 మందికి 17న రాజ్‌భవన్‌లో కాంపిటీషన్ ఉంటుందని వెల్లడించారు. అయితే.. ఈ పోటీల్లో గెలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ. 12,500, రూ.7500, రూ.5000, మరో 10 కన్సోలేషన్ ప్రైజ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

అయితే.. శనివారం పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే వేడుకల్లో అమిత్‌ షా పాల్గొనడంపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గవర్నర్‌ ఈప్రకటన సంచళనంగా మారింది. ఇవాళ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భాగ్య లక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం బైక ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విమోచన దినోత్సవంలో సందర్భంగా.. కిషన్ రెడ్డి బుల్లెట్ నడిపి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళల బైక్ ర్యాలీ మొదలైన ఈబైక్‌ ర్యాలీ.. చార్మినార్ నుండి పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బీజేపీ శ్రేణులు. అయితే.. శనివారం పరేడ్ గ్రౌండ్​లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు ప్రధాని మోడీ బర్త్ డే కావడంతో పార్టీ ఏర్పాటు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక.. తెలంగాణ ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య దూరం పెరిగింది. గ‌వ‌ర్న‌ర్‌కు ఇవ్వ‌వ‌ల‌సిన ప్రొటోకాల్‌ను కూడా ప్ర‌భుత్వం ఇవ్వ‌డం లేద‌ని, అధికారిక కార్య‌క్ర‌మాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ అనేక‌మార్లు పేర్కొన్నారు. దీంతో.. గ‌వ‌ర్న‌ర్ రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌జా స‌మస్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌జాద‌ర్భార్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
Doordarshan @ 63: దూరదర్శన్‌ పుట్టింది ఈ రోజే..

Exit mobile version