Doordarshan @ 63: దూరదర్శన్ పుట్టింది ఈ రోజే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో ఇప్పుడు రకరకాల డీటీహెచ్‌లు, శాటిలైట్ టెలివిజన్ వ్యవస్థలు, కేబుల్ టీవీ.. యూ ట్యూబ్ ఇలా ఎన్నో వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. ఒకప్పుడు న్యూస్ కానీ, ఏదైనా వినోద కార్యక్రమాలు, సినిమాలు.. ఇలా ఏదైనా దూరదర్శన్ చానల్ ఒక్కటే దిక్కు… వారాంతాల్లో వచ్చే సినిమాలు, సీరియళ్లు, చిత్రలహరి, ఇతర ప్రయోజిత కార్యక్రమాలు.. రోజు ప్రసారం అయ్యే వార్తల కోసం ప్రజలు ఎంతో ఎదరుచూస్తూ ఉండేవారు.. ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు ఇలా ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి.. అప్పట్లో ఏ ఇతర ప్రసార మాద్యమాలు కూడా లేకపోవడంతో.. ఆ కార్యక్రమాలకు మంచి ఆదరణ ఉండేది.. జాతీయస్థాయిలో.. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో అభిమానులను సంపాదించుకున్న డీడీ.. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటుంది..
దూరదర్శన్ ప్రారంభించబడింది.. భారతదేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ (డీడీ) తన కార్యకలాపాలను ప్రారంభించింది ఈ రోజే.. సెప్టెంబర్ 15, 1959న న్యూఢిల్లీలో ప్రారంభమైంది.. ఇది విద్య మరియు అభివృద్ధిపై అరగంట కార్యక్రమాల ప్రసారంతో ప్రారంభమైన ప్రయోగాత్మక ప్రసారం. టెలికాస్ట్‌ను ఉత్పత్తి చేయడానికి చిన్న ట్రాన్స్‌మిటర్‌తో కూడిన తాత్కాలిక స్టూడియో ఉపయోగించబడింది. ఈ పరికరాలను ప్రారంభ ప్రసారానికి ఉపయోగించే ముందు ఆల్ ఇండియా రేడియో నుండి ఇంజనీర్లు పరీక్షించారు. కాలక్రమేణా దూరదర్శన్ ఉనికి మరియు సాధారణ ప్రజలలో దృశ్యమానత పెరిగింది. అదనంగా, స్టూడియో పరికరాలు మరియు ట్రాన్స్‌మిటర్‌ల పరంగా, ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార సంస్థలలో ఒకటిగా ఉంది..
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ఇక, దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. డీడీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. సెప్టెంబర్ 15న వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. దూరదర్శన్ బృందానికి సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇది ఒక ముఖ్యమైన సందర్భం అంటూ ట్వీట్ చేశారు.. దశాబ్దాలుగా, ఈ ఛానెల్ భారతదేశం యొక్క మార్పులేని ప్రయాణాన్ని సంగ్రహించిందని మరియు దాని ఆర్కైవ్‌లు దేశ గొప్ప చరిత్రకు నిధి అని ఆయన రాసుకొచ్చారు.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కలర్ వరకు.. డీడీ ప్రస్తానాన్ని చెప్పే ఓ వీడియోను కూడా షేర్ చేశారు. కాగా, కాల క్రమంలో రకరకాల ప్రసార మాద్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు దూరదర్శన్‌కు ఆదరణ తగ్గిపోయింది.. అంతే కాదు ఇతర ప్రసార మాద్యమాలకంటే.. ఇప్పడు సోషల్ మీడియాపై ఫోకస్ పెరిగిన విషయం తెలిసిందే. ఏది జరిగినా.. క్షణాల్లో అది సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోతోంది.
A momentous occasion as we mark Doordarshan’s Foundation Day – Through decades, the channel has captured the timeless journey of India in transition and its archives are a treasure trove of our rich history.
Best wishes to Team DD on this day as we gear up to capture the future! pic.twitter.com/43u3APk63f
— Anurag Thakur (@ianuragthakur) September 15, 2022
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!