NTV Telugu Site icon

K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

K.lakshman

K.lakshman

K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలన్నారు. ఫైనల్స్ లో బీజేపీ దే విజయం అన్నారు. మోడీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాహుల్ ను ప్రజలు విశ్వసించ లేదన్నారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించిందని, మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని తెలిపారు. పార్టీలో ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. ఉదాహరణ నేనే.. అన్నారు. దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదన్నారు.

Read also: Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండకల సీట్లు తెలంగాణలో గెలుస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని తెలిపారు. తెలంగాణలో అధ్యక్ష మార్పు అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బీజేపీని గెలిపించారని తెలిపారు. బీజేపీ పాలన నచ్చి ఓటు వేశారని అన్నారు. ఓట్ల కోసం ఉచితాలను ఇస్తామని మభ్యపెట్టినా జనం తిరస్కరించారని తెలిపారు. అవినీతి నుంచి జనం మార్పు కోరుకున్నారని అన్నారు.
Telangana Assembly: మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ.. తెలుగులో గవర్నర్‌ ప్రసంగం..

Show comments