K. Laxman: మేడిగడ్డ బ్యారేజ్ పై అప్పట్లో సీబీఐ విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ చొరవతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. డిజైన్ లోపం ఉందని చెప్పిందన్నారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే గత ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. సీబీఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డీ అప్పుడు డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని ఆరోపించారు. మంత్రులు గుంపుగా వెళ్ళారు. అఖిల పక్షాన్ని విస్మరించారని మండిపడ్డారు.
Read also: Ponnam Prabhakar: ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు
మేడిగడ్డని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నించారు. ఎవరిని ఈ ప్రభుత్వం బాధ్యులను చేస్తుంది చెప్పాలన్నారు. ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఆ అధికారులతో నేపవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. ప్రభుత్వం తీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు శిక్షించారని.. వాళ్లు తిన్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం దే అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకునేందుకు ఇలా చేస్తుందా? అని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిల్చోవాల్సి వస్తుందని తెలిపారు.
Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఈ తాతదే.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా?