Seetakka: మా ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetakka: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో విలేఖరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికింది ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అన్నారు. సీఎం హోదాలో మొదటి సభ కూడా ఇక్కడే నిర్వహించనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ పేర్లతో మోసం చేస్తే,, తాము ఉద్యోగాల కల్పన చేశామన్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. ఇంద్రవెల్లి పోరాటంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉందని, అంగన్ వాడి కేంద్రాలు లేవన్నారు.
కడెం ప్రాజెక్టు ను గత ప్రభుత్వం మరిచిపోయిందని అన్నారు. కడెంకు నిధులు కేటాయించి పునరుద్దరణ పనులు చేపడుతామన్నారు. జీతాలు ఇవ్వడానికి కనీసం బడ్జెట్ లేని పరిస్థితి అని తెలిపారు. ఆదివాసి గుడాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పభుత్వం కేవలం వాళ్ళు ఉండడానికి ఖరీదైన బంగళాలు నిర్మించుకున్నారు కానీ.. పేదలకు ఒక్క ఇండ్లు కట్టియ్యలేదన్నారు. ఉద్యమకారులు నోరు నొక్కిందని అన్నారు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెడితే కొందరు నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండ రాంకు ఎమ్మెల్సీ ఇస్తే ఓర్వలేక కేసు వేశారని అన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ప్రజల సెంటిమెంట్ వాడుకుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వదిలి బీఆర్ఎస్ అవినీతి కోసం కాళేశ్వరం చేపట్టిందని మండిపడ్డారు.
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ.. ఆగస్ట్ 9, 2021 లో ఇంద్రవెల్లి లో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ విజయమే ప్రభుత్వ ఏర్పాటుకు పునాది పడిందన్నారు. ఇంద్రవెల్లి సభలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి దండోరా సభ, పాదయాత్రను కొనసాగించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ నేతలంటున్నారని, మా సక్సెస్ కేవలం మేము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ స్కీమ్ చూస్తే తెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ మాటలు మోసపూరిత మైనవని అన్నారు.
Ranji Trophy: రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న 12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు.. తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
తాజావార్తలు
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
-
Sunil Gavaskar: “పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్ అతడే”.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
ట్రెండింగ్
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!