Site icon NTV Telugu

Revanth Reddy: రెండో రోజు రేవంత్ ఇంటిచుట్టూ బందోబస్తు.. ఓయూ క్యాంపస్ లో హై అలెర్ట్

Revanthreddy, Usmaniya Univercity

Revanthreddy, Usmaniya Univercity

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని నిన్న పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా రేవంత్‌ ఇట్టి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న, నేడు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. నిన్న ఓయూ దీక్షకు వెళ్లేందుకు సిద్దమైన రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. రేవంత్‌ రెడ్డి ఇంటికి ఎవరికి అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎవరిని అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి దగ్గర రెండు అంచల పటిష్ట భద్రత, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ కూడా నిరుద్యోగ నిసరనకు పిలుపు రెండోరోజు కావడంతో.. రేవంత్‌ రెడ్డిని ఇంటిని బయటకు కదలకుండా.. హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే నిన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ను హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై స్పందించిన అద్దంకి దయాకర్ రావు పేపర్ లీక్ విషయం పక్కన పెట్టి మాపై పడ్డారేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను హౌజ్ అరెస్ట్ లు చేయడం మతలబు ఏంటని మండిపడ్డారు.

Read also: Tulasi In Milk : తులసి ఆకుల పాలు తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరుగుతాయి

టీఎస్పీఎస్సీ అక్రమాలపై 24, 25 ఉస్మానియా యూనివర్షిటిలో నిరసన దీక్ష చేపట్టేందుకు రేవంత్‌ రెడ్డి విద్యార్థులకు పిలుపు ఇవ్వడంతో.. ఓయూ క్యాంపస్‌ అట్టుడికింది. టీఎస్పీఎస్సీ అక్రమాలపై నిలదీయాలని విద్యా్ర్థుల జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడతోందని 24, 25 తేదీల్లో టీఎస్పీఎస్సీ అక్రమాలపై దీక్షకు పిలుపు నిచ్చారు రేవంత్‌. నిరుద్యోగ నిరసన పిలుపుతో ఓయూ క్యాంపస్‌కు ఉదయం నుంచే జేఏసీ నాయకులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్పమత్తమయ్యారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఓయూ క్యాంపస్‌ లో ఎవరికి అనుమతించడంలేదు. నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ నుండి గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు జేఏసీ నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని అదుపులో తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపుతో మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈమేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా జేఏసీ నాయకులను, విద్యార్థులను అదుపులో తీసుకున్నారు. దీంతో నిన్న, నేడు క్యాంపస్ లో హై అలెర్ట్ ప్రకటించారు.
Tulasi In Milk : తులసి ఆకుల పాలు తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరుగుతాయి

Exit mobile version