NTV Telugu Site icon

Lovers Suicide: సంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య..

Software Engineer Suicide

Software Engineer Suicide

తెలిసి తెలియని వయసులో ఇష్టపడుతున్నారు.. ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత తెలిసిన వయసులో తనువు చాలిస్తున్నారు. తాము ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్లు.. ఇంట్లో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారు చనిపోయి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. మనం రోజు వార్తల్లో ఎక్కడో దగ్గర చూస్తుంటాం.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నారనే ఘటనలు ఎన్నో విన్నాం.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…..

Read Also: Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?

సంగారెడ్డి జిల్లా మునిపల్లి (మం) బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట.. ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే.. రాత్రి పూట ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, ఉదయం రూమ్ క్లినింగ్‌కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే.. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో.. మునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు ఉదయ్(26), మౌనిక (19)గా గుర్తించారు. మృతుల స్వస్థలం సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట గ్రామం. ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో హరిత రిసార్ట్‌లో ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Read Also: Hyderabad: గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాళా..